అక్షరటుడే, కామారెడ్డి: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామన్ డైట్ మెనూ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వంటకు ఉపయోగించే ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు.