అక్షరటుడే, హైదరాబాద్: మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో.. 42శాతం రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టనుంది. సభలో సభ్యులు చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత కల్పించనున్నారు. మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. అదే రోజు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనునున్నారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు కోరనున్నారు. కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాడే యోచనలో ఉన్నారు. ఈ మేరకు అఖిలపక్ష నేతలను ఢిల్లీ తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని పార్టీలకు సీఎం రేవంత్ లేఖలు రాయనున్నట్లు సమాచారం. మార్చి మూడో వారంలో టీజీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి.