అక్షరటుడే, వర్ని: వర్ని మండలం కూనీపూర్ లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి మహా స్వామి, మల్లారం పిట్ల కృష్ణ మహరాజ్ స్వామి హాజరయ్యారు. ఉదయం యజ్ఞం చేసిన అనంతరం విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.