ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

0

అక్షరటుడే, ఆర్మూర్: ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. రైతులు, చేపలు పట్టే వారు, పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని సూచించారు.