అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: కట్నం వేధింపులు తాళలేక చాంద్రాయన్ పల్లికి చెందిన వేముల మనోజ(25) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇందల్వాయి ఎస్సై తెలిపారు. మనోజ భర్త సాయిలు అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడు. దీంతో వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి గ్రామ శివారులో పెద్ద పోచమ్మ గుడి దగ్గర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.