అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని ఎల్లమ్మగుట్టలో శుక్రవారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గౌస్ పాషా అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. కిరాణా దుకాణం వద్ద జరిగిన చిన్నపాటి గొడవ వల్లే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు గంజాయి మత్తులో దాడి చేసినట్లు తెలిసింది.