అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని గౌతంనగర్ లో జరిగిన కత్తిపోట్ల ఘటనలో బాధితుడు పవన్(20) మృతి చెందాడు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గౌతంనగర్ కు చెందిన పవన్, చందు, చిన్నూ యాదవ్ ఆదివారం సాయంత్రం గొడవపడ్డారు. తిరిగి రాత్రి సమయంలో పవన్ ఇంటికి వెళ్ళిన చందు, చిన్నూతో పాటు అతని తల్లి మళ్లీ గొడవకు దిగారు. ఇదే సమయంలో చిన్నూ తల్లి రేణుక పవన్ పై కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.