అక్షరటుడే, బాన్సువాడ : దివ్యాంగులు మానసికంగా ఎంతో శక్తిమంతులని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అలింకో సంస్థ సహకారంతో బాన్సువాడ శివారులోని ఓ ఫంక్షన్ శుక్రవారం దివ్యాంగుల నిర్దారణ శిబిరం నిర్వహించారు. మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణల పంపిణీ కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ శిబిరంలో వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం 80 శాతం అంగవైకల్యం ఉన్నవారికి బ్యాటరీతో నడిచే సైకిళ్లను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, నార్ల సురేష్, ఎజాజ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.