అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆయన రోడ్డు మార్గంలో జిల్లాకు చేరుకోనున్నారు. ఉదయం ధర్పల్లి మండలంతో పాటు నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేనున్నారు. అలాగే మధ్యాహ్నం ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం హైదరబాద్‌కు తిరుగు పయణం అవుతారు.