అక్షరటుడే, నిజాంసాగర్: పెద్ద కొడపగల్ మండలంలోని అంజని గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు రూ.50వేల విరాళం అందజేశారు. సోమవారం గ్రామానికి చెందిన విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులకు విరాళాన్ని అందించారు. కార్యక్రమంలో యువకులు కృష్ణ గౌడ్, రమేష్ రావు, శ్యాంసుందర్, సాయిబాబా గౌడ్ ఉన్నారు. త్వరలోనే విగ్రహ ఏర్పాటు పనులు చేపట్టనున్నారు.