NRI : మీరు ఎన్ఆర్ఐనా? ఈ కొత్త టాక్స్ రూల్స్ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు

NRI : మీరు ఎన్ఆర్ఐనా? ఈ కొత్త టాక్స్ రూల్స్ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు
NRI : మీరు ఎన్ఆర్ఐనా? ఈ కొత్త టాక్స్ రూల్స్ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ NRI: ఎన్ఆర్ఐ అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ ఇండియన్. అంటే భారతదేశానికి చెందిన పౌరుడే కానీ.. విదేశాల్లో ఉంటున్నాడు అని అర్థం. మీరు విదేశాల్లో ఉన్నా కూడా భారత్ కు ఇక నుంచి పలు విధాలుగా టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా ఎలా అంటారా? దీన్ని కాస్త లోతుగా విశ్లేషించాలి పదండి.

ఎన్ఆర్ఐల ఆర్థిక వ్యవహారాలపై భారత్ కన్నేసింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది భారత్. అంటే.. ఎన్ఆర్ఐలు ఎలాంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో వాళ్లకు ఎలాంటి కంపెనీలు ఉన్నాయి. విదేశీ బ్యాంక్ ఖాతాల్లో వాళ్ల లావాదేవీలు ఎలా ఉన్నాయి..ఇవన్నీ భారత్ గమనిస్తోంది. ఒకవేళ ఎన్ఆర్ఐ విదేశాల్లో ఆర్ఎన్ఓఆర్ గా అర్హత సాధిస్తే వాళ్లకు అన్ని రకాలుగా పన్ను పడే అవకాశం ఉంది.

NRI: ఆర్ఎన్ఓఆర్ అంటే ఏంటి?

ఆర్ఎన్ఓఆర్ అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అర్థం. వీళ్ల విదేశీ బ్యాంకుల లావాదేవీలు, బ్యాంక్ డిపాజిట్ల వడ్డీలు, స్టాక్ డివిడెంట్స్, ఇలా పలు ఆర్థిక లావాదేవీలపై భారతదేశం పన్ను విధిస్తుంది. అలాగే.. ఎన్ఆర్ఐలు కచ్చితంగా తమ విదేశీ ఆస్తులను కూడా భారత్ కు స్పష్టం చేయాల్సి ఉంటుంది. భారతదేశంతో ఎలాంటి కనెక్షన్ ఉన్నా..

ఇది కూడా చ‌ద‌వండి :  Virat Kohli : ఫైన‌ల్‌కు ముందు అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న కోహ్లీ.. అస‌లేమైందంటే..!

అంటే ఇండియన్ క్లయింట్స్ నుంచి ప్రాజెక్టులు, ప్రొడక్టుల ద్వారా ఆదాయం పొందితే వాటిపై కచ్చితంగా భారత్ కు పన్ను కట్టాల్సిందే. కొత్త పన్ను విధానం వల్ల ఎన్ఆర్ఐలు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చివరకు క్రిప్టో, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినా అవి కూడా ఇండియా టాక్స్ లిమిట్ లోకే రానున్నాయి. అందుకే ఆ వివరాలన్నీ భారత్ కు నివేదించాల్సి ఉంటుంది.

Advertisement