అక్షరటుడే, బిచ్కుంద: జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బిచ్కుందకు చెందిన ఆర్యభట్ట పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఇటీవల బాన్సువాడలో జరిగిన పోటీల్లో పాఠశాల విద్యార్థులు సాదిక, శ్రావణి, అక్షర ఓజోన్ పొర పరిరక్షణ, అనర్థాలపై ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రదర్శన ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో డీఈవో చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధరాంరెడ్డి, ఎంఈవో నాగేశ్వరరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుషాల్, ఆర్యభట్ట పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.