అక్షరటుడే, ఆర్మూర్‌: పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫుడ్‌ ఫేర్‌ నిర్వహించారు. కళాశాలకు చెందిన బీఎస్సీ న్యూట్రిషన్‌ విభాగం విద్యార్థులు ‘స్టాప్‌ హార్ట్‌ ఎటాక్‌ –సేవ్‌ హార్ట్‌ బీట్‌’ నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి మెడికల్‌ ఆఫీసర్‌ ఫాతిమా ఫిర్దోస్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ నవీన్‌ యాదవ్, హెల్త్‌ సూపర్‌వైజర్‌ శాంత, అసిస్టెంట్‌ ఆనంద్, న్యాయవాదులు శ్యాం యాదవ్, చైతన్య, రాజేందర్, అధ్యాపకులు రాకేష్‌ గౌడ్, సుమలత, నవనీత, అర్చన, రజనీకాంత్, నిఖిత, పూజిత పాల్గొన్నారు.