అక్షరటుడే, బాన్సువాడ: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకమని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ఆమె వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో బషీరుద్దీన్, మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.