అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బుధవారం సందర్శించారు. గ్రామంలో 267 సర్వే నంబర్‌కు చెందిన వ్యవసాయ భూమి కోర్టు కేసులో ఉండడంతో ఆ భూమిని పరిశీలించారు. కోర్టులో దరఖాస్తు చేసిన రైతుతో పాటు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నత అధికారులకు అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట పిట్లం తహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.