అక్షరటుడే, బోధన్: ప్రభుత్వ వసతిగృహాల్లో నూతనంగా అమలులోకి తెచ్చిన డైట్ మెనూను పక్కాగా అమలు చేయాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన కామన్ డైట్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.