అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట మండలం వన్నెల్(కె)లోని ఇటుకబట్టీలో పనిచేసే కృష్ణ (32) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణ గ్రామంలోని ఇటుకబట్టీలో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన ఆయన జీవితంపై విరక్తితో ఆదివారం రాత్రి ఇటుకబట్టీ ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.