అక్షరటుడే, బిచ్కుంద: బిచ్కుంద మండలం కందర్​పల్లి చౌరస్తా వద్ద ఎండు గంజాయి విక్రయిస్తున్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. దెగ్లూర్​కు చెందిన అర్జున్ భగత్ సింగ్ బండారి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు గురువారం దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 154 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్​కు తరలించామన్నారు.