అక్షరటుడే, కోటగిరి: పోతంగల్‌ మండలం సుంకిని పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై సందీప్‌ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వాహనాన్ని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.