అక్షరటుడే, కోటగిరి: కోటగిరి మండలం ఎక్లాస్​పూర్​ గ్రామానికి చెందిన బండారి జ్యోతి (24) తన కుమారుడితో సహా అదృశ్యమైనట్లు ఎస్సై సందీప్​ తెలిపారు. బుధవారం తన ఏడాదిన్నర కొడకు అద్వైత్​ను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కాగా.. జ్యోతికి మాటలు రావు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కోటగిరి ఎస్సై(8712659878), రుద్రూర్​ సీఐ(8712659875)కి సమాచారం ఇవ్వాలని కోరారు.