అక్షరటుడే, కోటగిరి: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని ఎస్సై సందీప్ అన్నారు. కోటగిరి మండలంలోని వల్లభాపూర్ గ్రామస్థులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న 12 సీసీ కెమెరాలను ఎస్సై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షులు అంజయ్య, కార్యదర్శులు లక్ష్మణ్, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.