అక్షరటుడే, బిచ్కుంద: మండలంలోని ఎల్లారంలో విష జ్వరాలు ప్రబలాయి. పలువురు గ్రామస్థులు చికున్‌గున్యా, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. దీంతో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే స్పందించి వైద్యశిబిరం ఏర్పాటు చేయించడంతో గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.