అక్షరటుడే, కామారెడ్డి: తమను కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాడ్వాయికి చెందిన సుర్కంటి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం ఆయన తన కొడుకు ప్రకాష్ రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్​లో మాట్లాడారు. తమ బంధువులతో గొడవ కారణంగా 2023 డిసెంబర్​లో రెడ్డి సంఘంలో పంచాయితీ పెట్టారన్నారు. ఆ పంచాయతీకి తాము వెళ్లకపోయినా రూ.5 వేలు కట్టాలని అడగడంతో తాము చెల్లించలేదన్నారు. దీంతో తమను బహిష్కరించి.. 13 నెలలుగా శుభకార్యాలకు, ఏ ఇతర కార్యక్రమాలకు పిలవడం లేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసినా కులసంఘ సభ్యులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.