అక్షరటుడే, ఇందూరు: క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి సీఎం కప్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడినవారు నిరుత్సాహపడకుండా గెలుపు కోసం కష్టపడాలన్నారు. అంతకుముందు క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఎస్డీవో ముత్తెన్న, పేట సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, సీనియర్ క్రీడాకారులు, పీడీ, పీఈటీ, కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.