అక్షరటుడే, ఆర్మూర్‌: ఆర్మూర్‌ బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం తహసీల్దార్‌ గజానందన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీని, హెచ్‌ఎం, ఉపాధ్యాయులను విడివిడిగా విచారించారు. రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.