అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండలం రెండో బ్రిడ్జ్ వద్ద అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసినట్లు తహశీల్దార్ మల్లయ్య తెలిపారు. దాదాపు 20 ట్రాక్టర్లు ట్రిప్పుల ఇసుకను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.