INDIA-BAN | ముందు మీ సంగ‌తి చూసుకోండి.. బంగ్లాపై భార‌త్ ఆగ్ర‌హం

INDIA-BAN | ముందు మీ సంగ‌తి చూసుకోండి.. బంగ్లాపై భార‌త్ ఆగ్ర‌హం
INDIA-BAN | ముందు మీ సంగ‌తి చూసుకోండి.. బంగ్లాపై భార‌త్ ఆగ్ర‌హం

అక్షరటుడే, వెబ్​డెస్క్​:INDIA-BAN | పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్(Murshidabad) జిల్లాలో ఇటీవల జరిగిన మత హింసకు సంబంధించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను భార‌త్(India) శుక్రవారం తిప్పికొట్టింది. ముందు మీ సొంత దేశంలో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను పరిష్కరించాలని హిత‌వు ప‌లికింది.

Advertisement

“పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సంఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్(Bangladesh) వైపు చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులపై భారత్ ఆందోళనలను సమాంతరంగా చూపించడానికి ఇది కేవలం దాచిపెట్టిన, మోసపూరిత ప్రయత్నం. ఇక్కడ అటువంటి చర్యలకు పాల్పడే నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు” అని మన విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం కంటే బంగ్లాదేశ్ త‌న సొంత దేశంలో మైనారిటీల హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డంపై దృష్టి పెట్ట‌డం మంచిదని సూచించింది.

వక్ఫ్(waqf) (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ముర్షిదాబాద్‌లో ఏప్రిల్ 11న చెలరేగిన హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ అల్ల‌ర్ల‌లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వంద‌లాది హిందూ కుటుంబాలు ప్రాణాల‌తో పారిపోయారు. కొందరు జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో ఆశ్రయం పొందగా, మరికొందరు మాల్డాలోని సహాయ శిబిరాలకు(Malda relief camps) తరలివెళ్లారు.

ఇది కూడా చ‌ద‌వండి :  BCCI | బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

అయితే, ఈ ఘ‌ర్ష‌ణ‌ల వెనుక బంగ్లా నుంచి వ‌చ్చిన వారి హస్తం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ముర్షిదాబాద్‌లో జ‌రిగిన మ‌త హింస‌లో బంగ్లాదేశ్‌ను ఇరికించే ప్ర‌య‌త్నాలు ఖండిస్తున్నామ‌ని, భారతదేశం తన ముస్లిం మైనారిటీ జనాభాను ర‌క్షించుకోవాల‌ని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం(Press Secretary Shafiqul Alam) చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా విదేశాంగ శాఖ స్పందించింది.

Advertisement