అక్షరటుడే, హైదరాబాద్: భారత్ కోసం ఎలన్ మస్క్ టెస్లా ప్రణాళికలు రూపొందించింది. భారతదేశం – 2024 EV పాలసీ ప్రకారం.. 110% నుంచి 15% తగ్గించిన కస్టమ్స్ సుంకంతో జర్మనీ నుంచి ఏటా 8,000 కార్లను దిగుమతి చేసుకోవాలని టెస్లా చూస్తోంది. టెస్లా రూ.20-25 లక్షల బడ్జెట్ EV వాహనాలు తయారు చేయాలని యోచిస్తోంది. 5 లక్షల యూనిట్ తయారీ సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ప్లాన్ చేస్తోంది. ఇక్కడ తయారుచేసిన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచనలోనూ ఉంది. టెస్లా యూనిట్ తయారీ కేంద్రాన్ని చేజిక్కించుకునేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ పోటీ పడుతున్నాయి.