అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఆయన మార్నింగ్ వాక్‌కు వెళ్తుండగా.. బోర్గాం(పి) కమాన్ సమీపంలో వెనుక నుంచి ఆటో వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.