అక్షరటుడే, వెబ్ డెస్క్: వేల్పూర్ మండలంలోని పడకల్ గ్రామంలో పేకాడుతున్న 14 మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. గ్రామంలోని కోళ్ల ఫారంలో ఆదివారం రాత్రి పేకాడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 14 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి 13 సెల్ ఫోన్లు, రూ.35,460 నగదు స్వాధీనం చేసుకున్నారు.