అక్షరటుడే, బోధన్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్‌లో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం నవీపేట్ పోలీస్‌స్టేషన్‌కు అప్పజెప్పామని పోలీసులు తెలిపారు.