అక్షరటుడే, బాన్సువాడ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి యాటకారి సాయన్న అన్నారు. పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. కేజీబీవీ ఉపాధ్యాయులు అరకొర జీతాలతో నెట్టుకొస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి అమలాయ్యేలా ప్రయత్నిస్తానన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్, గంగాధర్, పాండు, జగన్మోహన్, లక్ష్మీ యాదవ్, హరిలాల్, నర్సింలు, శ్యామ్, సాయన్న, విద్యాసాగర్ పాల్గొన్నారు.