అక్షరటుడే, వెబ్ డెస్క్: ఉమెన్స్ ఆసియా కప్ సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 81 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. స్మృతి మంధాన 55, షఫాలీ వర్మ 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ గెలుపుతో టీమ్ ఇండియా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ రాత్రి శ్రీలంక-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. అందులో గెలిచిన జట్టుతో ఎల్లుండి భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.