అక్షరటుడే, వెబ్‌డెస్క్: మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం శనివారం జిల్లాలో పర్యటించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో అధ్యయన నిమిత్తం 30 మంది చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అంకిత్‌తో భేటీ అయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వారికి పలు సూచనలు చేశారు. అనంతరం వారిని బృందాలుగా విభజించి గ్రామాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం కోసం కేటాయించారు.