అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ టెక్నికల్ సబార్డినేట్ విద్యానందం శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు శాఖ అధికారులు, సిబ్బంది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాల, శాలువాలతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజినీర్ ఉమేష్ చంద్ర, రిటైర్డ్ సీనియర్ పర్యవేక్షకుడు రవూఫ్, మాజిద్, సిబ్బంది పాల్గొన్నారు.