రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు జిల్లాలకు చెందిన ఎస్పీలు, లూప్ లైన్ లో పని చేస్తున్న వారు, జంట నగరాల్లో పని చేస్తున్న అధికారులు ఉన్నారు. పలువురికి ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే త్వరలో మరికొంత మంది అధికారులు బదిలీ కానున్నట్లు సమాచారం.