ఆటో కార్మికులను ఆదుకుంటాం: పొన్నం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పామని, దానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఈ సంవత్సరం ఇవ్వలేకపోయామని, తప్పకుండా వారికి న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆటో కార్మికుల డ్రెస్ లు వేసుకోవడం, బేడీలు వేసుకొని వేషాలు వేయడం బీఆర్ఎస్ నాయకుల రాజకీయ డ్రామా అని విమర్శించారు.