అక్షరటుడే, కామారెడ్డి: కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణ బీడీ కామ్‌గార్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బీడీ కార్మికుల రామారెడ్డి రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రతి బీడీ కార్మికురాలికి నెలకు 26 రోజుల పని కల్పించాలన్నారు. కామారెడ్డిలో బీడీ వెల్పేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలకు రూ.4,016 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యం, రాజేందర్, పర్వవ్వ, రాజమణి, రజినీకాంత్, నర్సింలు, లింగం, మల్లేశం పాల్గొన్నారు.