అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.900. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు జరగనున్నాయి.