అక్షరటుడే, వెబ్డెస్క్: శాసనమండలి సమావేశాల్లో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్(tpcc chief mahesh kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తులో ఓబీసీ నేత సీఎం అవుతారని పేర్కొన్నారు. శాసన మండలిలో మంగళవారం ఆయన ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇందుకోసం అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని.. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఓబీసీ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.
కాగా.. గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీలో బీసీ అంశంపై వివాదం నడుస్తోంది. బీసీలకు తగిన ప్రాధాన్యం లేదంటూ పలువురు నేతలు బహిరంగగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు పదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ సీఎంపై అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది.