అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో అత్యాధునిక AI డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్​ఎస్​ డేటాసెంటర్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్​లో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా కంట్రోల్​ఎస్ సంస్థ రాష్ట్రంలో రూ. 10వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 3,600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.