అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువులను సమగ్ర సర్వే చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను ఆదేశించింది. సర్వే ద్వారా బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు వీలవుతుందని పేర్కొంది. సర్వే అనంతరం హైడ్రా మరింత దూకుడు పెంచనుందని తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల స్థలాల్లో ఆక్రమణలను ఇప్పటికే హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.