అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కొన్నిరోజుల క్రితం బీర్ల ధరలను పెంచి మందుబాబులకు షాక్‌ ఇచ్చిన తెలంగాణ సర్కారు.. మరోసారి మద్యం ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకంగా 15నుంచి 20 శాతం వరకు ధరలు పెంచేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. చీప్‌ లిక్కర్‌, బ్రాందీ, వైన్‌, విదేశీ మద్యంపై ధరలు పెరిగే అవకాశముంది. కాగా.. ఆర్థిక లోటును పూడ్చేందుకు ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.