అక్షరటుడే, వెబ్​డెస్క్​: SLBC టన్నెల్​లో ఎన్డీఆర్​ఎఫ్​, సైన్యం సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ పేర్కొన్నారు. టన్నెల్​లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నాగర్​ కర్నూల్​ కలెక్టర్​ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. త్వరలోనే వారు సురక్షితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.