అక్షరటుడే, హైదరాబాద్: దావోస్‌లో తెలంగాణ సంచలనం సృష్టించింది. రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయి. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో తెలంగాణతో ఇన్ఫోసిస్, అమెజాన్, మేఘా, విప్రో తదితర 16 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. తద్వారా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇవి నాలుగురెట్లు అధికం. ఈ కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. దావోస్‌ లో సీఎం రేవంత్‌ పర్యటన కూడా ముగిసింది. ఆయన నేడు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు.