అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థలం కోసమే ఉద్యమకారుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ఉద్యమకారులందరికి స్థలాన్ని ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. జిల్లా కన్వీనర్ గా శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధిగా ప్రగతి కుమార్, మర్రి కిరణ్ ను నియమించినట్లు ప్రకటించారు. సమావేశంలో బి.శ్రీనివాస్, గంగారం, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.