అక్షరటుడే, బోధన్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ప్రిన్సిపాల్‌ పద్మకుమారి తెలిపారు. ఫస్టియర్‌లో ఎంపీసీ 13, బైపీసీలో నాలుగు ఖాళీలు ఉన్నాయన్నారు. ఎంపీసీలో ఎస్సీ 10, ఎస్టీ 2, మైనారిటీ ఒక సీటు, బైపీసీలో బీసీ 4 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు తీసుకుంటామని.. ఆసక్తి గల విద్యార్థులు గడువులోగా హాజరుకావాలని సూచించారు.