అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఏమాత్రం మారట్లేదు. మెస్ లో విద్యార్థులకు అందించే భోజనంలో వరుసగా పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. న్యూ బాయ్స్ హాస్టల్ లో రెండ్రోజుల కిందట భోజనంలో పురుగు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను విలేకరులకు విడుదల చేశారు. హాస్టల్ వార్డెన్, కేర్ టేకర్లు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. మెస్ లో నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.