అక్షరటుడే, కామారెడ్డి: తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షల కేంద్రాన్ని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి బుధవారం తనిఖీ చేశారు. అనంతరం సౌత్ క్యాంపస్ గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, మోహన్ బాబు, లలిత, హరిత, నాగరాజు, అంజయ్య, హాస్టల్ వార్డెన్లు యాలాద్రి, సునీత, ఏపీఆర్వో సరిత, సబిత, రమాదేవి, నారాయణ, శ్రీమాత, నిరంజన్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ భరత్ రెడ్డి పాల్గొన్నారు.