అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోయాయి. లార్నూలో అత్యల్పంగా మైనస్ 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షోపియాన్‌లో మైనస్ 8 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 3.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. విపరీతంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.